నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం నీరుగట్టువారిపల్లి మాయ బజార్ రోడ్డు ఎదురుగా మిద్ద పైన, పట్టణ నడిబొడ్డున బి.ఎస్.ఎన్.ఎల్. ఆఫీస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఆధార్ కేంద్రంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆధార్ సెంటర్ పవన్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడారు. ఆధార్ కార్డు కొరకు ఇబ్బందులు పడుతున్న వారు, చిన్న పిల్లల నమోదు, పేరు, అడ్రస్ మార్పులు, చేర్పులు వంటి వాటిని ప్రత్యేక మొబైల్ ఆధార్ కేంద్రాల ద్వారా పరిష్కరించనున్నామన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ +91 99669 53956 ఆఫీస్ వద్దకు వచ్చి ఆధార్ సేవలను పొందాలని సూచించారు.
Reporter
Namitha News