Wednesday, 29 July 2026 01:39:40 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

పీటర్ రాక్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో ప్రజలు జీవించాలని సందేశం

Date : 22 December 2025 05:35 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పీటర్ రాక్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు - ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో ప్రజలు జీవించాలని సందేశం - గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు పిలుపు మదనపల్లి పట్టణం,బాలాజీ నగర్ పీటర్ రాక్ చర్చి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగిందని గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు తెలిపారు.ఇందులో భాగంగా క్రిస్మస్ పండుగను పురస్క రించుకొని పేదలకు బట్టలు పంపిణీ చేయడం,పాస్టర్లకు శుభాకాంక్షలు తెలియ జేయడం జరిగింది.అదే విధంగా గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ బోనాసి జాన్ బాబు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బోనాసి జాన్ బాబు మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ అనేది క్రిస్మస్ పండుగకు ముందుగా నిర్వహించుకునే ముందస్తు వేడుక అన్నారు.ఇందులో ప్రజలతోపాటు ఇతరులతో కలిసి సంతోషాన్ని పంచుకోవడం జరుగుతుందని గుర్తు చేశారు.డిసెంబర్ 25 వ తేదీన క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను గొప్పగా,సంతోషంగా జరుపు కుంటారన్నారు.ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు దయ,కరుణ కలిగి జీవించాలని సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ దివాకర్,పాస్టర్ మనై,పాస్టర్ పోలయ్య,పాస్టర్ శ్యామేలు,సిస్టర్ నిర్మల,శోభ,శ్యామల,ప్రమీల పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :