నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జూన్ 02 : ఆత్మకూరుకు చెందిన P. భవిష్ కుమార్ రెడ్డి అనే విద్యార్థి ఆల్ ఇండియా ఐఐటీలో 26వ ర్యాంకు సాధించాడు. ఆత్మకూరు పట్టణం పంట వీధికి చెందిన పందిపాటి వెంకటేశ్వరరెడ్డి, శ్రీమతి సౌజన్య కుమారుడైన ఈ విద్యార్థి మొన్న జరిగిన JEE అడ్వాన్స్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 26వ ర్యాంకు సాధించడం జిల్లాకే గర్వకారణం... వ్యవసాయ కుటుంబానికి చెందిన భవిష్ కుమార్ రెడ్డి కష్టపడి చదువులో రాణిస్తూ నేడు ఈ ర్యాంకు సాధించడం పై వారి తల్లిదండ్రులు బంధువులు ఆత్మకూరు గ్రామస్తులు అభినందనలు తెలుపుతూ ఎంతో సంతోషం వ్యక్తపరిచారు..రెండు లక్షల మంది రాసిన ఈ పరీక్షలో ఈ విద్యార్థి 26 ర్యాంకు సాధించడం నిజంగా అభినందనీయం.
Reporter
Namitha News