నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 12 : తంబళ్లపల్లె మండల పరిసరాల్లో విఘ్నం లఘు చిత్రం పై శనివారం పలు సన్నివేశాలు చిత్రం యూనిట్ సభ్యులు చిత్రీకరించారు. ఎస్ ఎస్ క్రియేషన్స్ సారధ్యంలో గ్రామీణ ప్రాంతాల ఇతివృత్తం పై నిర్మిస్తున్న ఈ లఘు చిత్రం లో హీరోగా పి శ్రీహరి, ప్రొడ్యూసర్ గా మహి రేపన, డైరెక్టర్ శ్రీహరి విలన్స్ గా హసన్, హరీష్, కథ ప్రశాంత్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సోహెల్, అరవింద్, శ్రీకాంత్, లోకేష్, నాని, జశ్వంత్ లు నటిస్తున్నట్లు చిత్రం యూనిట్ సభ్యులు తెలిపారు. డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ రాయలసీమ గ్రామీణ ప్రాంత ఇతిహాసం, సాంప్రదాయాలు, కట్టుబాట్ల ఇతివృత్తం పై చిత్రం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉదయం స్థానిక శివాలయం, సాలె వీధి, దాదం వడ్డిపల్లె లో పలు సీన్లు చిత్రీకరణ చేపట్టారు
Reporter
Namitha News