Monday, 14 September 2026 06:53:53 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సంక్రాంత్రి కి ఊరు వెళ్తున్నారా... మీ ఇంటి భద్రతలపై మా సూచనలు పాటించండి, అప్రమత్తంగా ఉండండి

మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు సూచనలు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 10 January 2026 11:05 AM Views : 364

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 10 : సంక్రాంతి పండుగ వేళ ప్రజలు తమ ఇంటి భద్రత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజలను చైతన్య పరచడానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పండుగ సెలవుల్లో ఇళ్లను వదిలి వెళ్ళే వారు పాటించవలసిన కీలక భద్రతా సూచనలను ఆయన పత్రికా ప్రకటన ద్వారా తెలియచేసారు. ప్రజల కోసం ఎస్పీ గారి కీలక సూచనలు ఇంటి తలుపులకు, బాల్కనీలకు నాణ్యమైన తాళాలు వాడండి. గేట్లకు బయట నుంచి కాకుండా, లోపలి వైపు తాళం వేయడం వల్ల మీరు ఇంట్లో లేరనే విషయం బయటి వారికి తెలియకుండా ఉంటుంది. ఇంట్లో భారీ నగదు, బంగారు ఆభరణాలు ఉంచవద్దు. వాటిని బ్యాంక్ లాకర్లలో లేదా నమ్మకస్థులైన బంధువుల వద్ద ఉంచడం క్షేమకరం. ఇంటి పరిసరాల్లో హై-రిజల్యూషన్ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. వీటిని మీ మొబైల్ ఫోన్‌కు అనుసంధానించడం ద్వారా ఎక్కడి నుంచైనా మీ ఇంటిని పర్యవేక్షించవచ్చు. ఊరెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో లేదా బీట్ కానిస్టేబుల్‌కు సమాచారం ఇవ్వాలి. దీనివల్ల గస్తీని ముమ్మరం చేసే వీలుంటుంది. మీరు లేని సమయంలో మీ ఇంటి పరిసరాలపై కన్నేసి ఉంచమని నమ్మకమైన పొరుగువారికి చెప్పండి. ఇంటి ముందు వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోమని కోరండి. ప్రయాణ వివరాలు, లైవ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దొంగలకు సులభంగా సమాచారం అందుతుంది. పండుగ ముగిసి ఇంటికి చేరిన తర్వాతే ఫోటోలను షేర్ చేయండి. రాత్రి వేళల్లో ఇంటి ఆవరణ, గ్యారేజ్ ప్రాంతాలు వెలుగుతో ఉండేలా చూడండి. చీకటి దొంగలకు అవకాశాన్ని ఇస్తుంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు మరియు కాలనీల్లో పోలీస్ వాహనాల ద్వారా మైకుల ద్వారా విశృతంగా ప్రజలకు అవగాహనా కల్పిస్తూ రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని సూచించారు. మైకుల ద్వారా అవగాహన కల్పిస్తూనే, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ మరియు బీట్ కానిస్టేబుళ్ల తనిఖీలను మరింత పటిష్టం చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు ఫోటో తీసి డయల్ 112 లేదా స్తానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించాలి. "మీ భద్రత మా బాధ్యత, కానీ మీ జాగ్రత్త మాకు అదనపు బలం. పోలీసుల సూచనలు పాటించి, నేరరహిత సమాజానికి సహకరిస్తూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి" అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకాంక్షించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :