నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 21 : ప్రతి ఒక్కరికి యోగా ఆసనాలు చేయడంతో ఆరోగ్యం తోపాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎంపీడీవో ఉషారాణి తెలిపారు. ఆదివారం ఉదయం ఆమె ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణంలో మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, అధికార పార్టీ నాయకులు, విద్యార్థులు అంతర్జాతీయ యోగా ఆసనాల కార్యక్రమం పాల్గొని ముమ్మరంగా ట్రైనర్ ల సూచనల మేరకు ముమ్మరంగా ఆసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉషారాణి, ఎంఈఓ త్యాగరాజులు యోగ ఆసనాల వలన శారీరక ఆరోగ్య సమస్యల ఉపశమనం పై పలు సూచనలు సలహాలు చేశారు. యోగ నిర్వాహకులకు టిడిపి నాయకుడు పురుషోత్తం అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఎంఈఓ నాగ సుబ్బరాయుడు, ఏపిఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, సిసి లు రమణ, కత్తి నరసింహులు,లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్,కార్యదర్శి శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్,పద్మావతి, భాస్కర్, మనోహర్,టిడిపి నాయకులు పురుషోత్తం, బేరి శ్రీనివాసులు,నరసింహులు, రామచంద్ర,రామాంజులు, వైద్యసిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Reporter
Namitha News