నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్ళపల్లె - సెప్టెంబర్ 03 : తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీ కేంద్రంతోపాటు పలు గ్రామాలలో గత కొంతకాలంగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. తాగునీటి సమస్యల పరిష్కారానికి టిడిపి మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడులు ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఫిర్యాదు చేశారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికనటి సమస్యలు ఉన్న గ్రామాలలో నీటి టాంకర్లు ఏర్పాటుకు కృషి చేశారు. గుండ్లపల్లి పంచాయతీలో అధికార యంత్రాంగం శాశ్వత తాగునీటి పరిష్కారం చేయాల్సి ఉంది.గుండ్లపల్లి పంచాయతీలో ట్యాంకర్లు ఏర్పాటుపైస్థానిక ప్రజలు టిడిపి కూటమి నాయకులు, అధికారుల చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు
Reporter
Namitha News