Wednesday, 29 July 2026 10:27:13 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

Date : 26 January 2026 12:49 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 26 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యన్.విజయ భాస్కర్ చౌదరి జాతీయ జెండా ను ఆవిష్కరించారు. కార్యక్రమం లో ముందుగా డాక్టర్ యన్.విజయ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచం లో మహిళల విజయాలు మరియు ప్రతి రంగం లోను ముందుడి విజయాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు. యూనివర్సిటీ లోని మహిళా అధ్యాపకులు మరియు విద్యార్థినుల చురుకైన భాగస్వామ్యం ఎంతో ప్రోత్సాహకరమని పేర్కొంటూ 2025–26 విద్యా సంవత్సరాన్ని ‘వుమెన్ ఫస్ట్’ సంవత్సరంగా ఆయన అభివర్ణించారు. ప్రతిష్టాత్మకమైన ఎన్‌సీసీ, ఎయిర్ వింగ్ తదితర విభాగాల్లో విద్యార్థినిలు ముందడుగు ప్రశంసనీయమని, ప్రతి విభాగం లో కూడా వారి పాత్ర ముఖ్యమని ఆయన అన్నారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు యూనివర్సిటీలో చేరినట్టు, పరిశోధనలు మరియు నూతన ఆవిష్కరణలు చేయుటకు కృషిచేలని ఆయన అన్నారు. మిట్స్‌ యూనివర్సిటీ ని దేశంలోనే అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని ఆయన అన్నారు. పరిశ్రమలతో అనుసంధానం, నాణ్యమైన ఇంటర్న్‌షిప్‌లు కీలకమని, అధ్యాపకులు పాలిటెక్నిక్‌లు, ఇంటర్మీడియట్ కళాశాలలతో నిరంతర సహకారం పెంచుకుని అవసరమైన మౌలిక సదుపాయాలు అందించాలని అన్నారు. రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, విమానోత్పత్తి, ఎగుమతుల మొదలైన రంగాలలో విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, సిలబస్, పరీక్షా విధానం, అవుట్‌రీచ్, ఇంటర్న్‌షిప్‌లలో మార్పుల ద్వారా విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేయాల్సిన అవసరం మనపై ఉందన్నారు. మన భవిష్యత్తుకు మనం సిద్ధమా? అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ ద్వారకనాథ్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పీ. రామనాథన్, వైస్ ప్రిన్సిపాల్ సి. కమల్ బాషా, ఫిసికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, అధ్యాపకులు, యన్.సి.సి, యన్.ఎస్.ఎస్, ఎయిర్ వింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :