Tuesday, 15 September 2026 09:44:17 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్

బిసివై అధినేత రామచంద్ర యాదవ్ ను, బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ల ఆత్మీయ కలయిక

Date : 11 June 2026 11:08 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 11: వెనుకబడిన తరగతుల అభివృద్ధి, సాధికారత, రాజ్యాధికారం కోసం బిసి సంఘాల ఐక్యత ఎంతో అవసరం అని బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్, బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ‌శుక్రవారం మదనపల్లెకు విచ్చేసిన బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిసివై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు బిసి హక్కుల పోరాట సమితి నాయకులు సాదర స్వాగతం పలికి దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ‌ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు చర్చించి, పలు విషయాలను పంచుకున్నారు. బిసిలు అందరూ తమ విభేదాలను పక్కన పెట్టి, ఒకే వేదికపైకి రావడం ద్వారా మాత్రమే చట్టసభల్లో సముచిత స్థానం, ఆర్థికాభివృద్ధి, రిజర్వేషన్ల ఫలాలు పూర్తి స్థాయిలో అందుకోగలరని అభిలాషించారు. బీసీ ఐక్యత రాజ్యాధికార సాధన, జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే అన్ని కులాల విభేదాల వీడి ఐక్యతగా వుండాలని అన్నారు. బిసిల పేరు చెప్పుకునే అధి నాయకులు స్వప్రయోజనాలు పక్కనపెట్టి, సామాజిక న్యాయం కోసం కులాలకతీతంగా కలిసి పనిచేయాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. ‌ బీసీలకు విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ఆర్థికంగా, రాజకీయంగా సాధికారత లభించినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పుంగనూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిసి హక్కుల పోరాట సమితి నాయకులు రామలింగ, రామాంజులు, చిన్న రెడ్డెప్ప, సుబ్బారాజు, సిద్దయ్య, మోహన్, శ్రీనివాసులు, చంద్రయ్య, జయన్న, గంగిరెడ్డి, మోహన్ యాదవ్, శ్రీనివాసులు, వెంకటేష్, సుధాకర్, కుమార్ తదితరులు బోడే రామచంద్ర యాదవ్ ను కలవడం జరిగింది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :