నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - ఏపీ అభివృద్ధిలో నల్లారి కుటుంబానిది ప్రత్యేక ముద్ర - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ ప్రశంసలు మదనపల్లె : తెలుగుదేశం పార్టీలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి డైనమిక్ లీడర్ అని,కష్టకాలంలో పార్టీకి,కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడని టిడిపి సీనియర్ నేత ఆర్.జె.వెంకటేష్ ప్రశంసించారు.ఆదివారం పట్టణంలోని నిమ్మనపల్లె కూడలి నందు గల పార్టీ కార్యాలయంలో ఆర్.జె.వెంకటేష్ ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తల సమక్షంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఇందులో భాగంగా కేక్ కట్ చేసి అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆర్.జె.వెంకటేష్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలతోపాటు రాష్ట్ర అభివృద్ధిలో నల్లారి కుటుంబీకులు తనదైన ముద్రవేశారన్నారు.స్వర్గీయ అమనాథరెడ్డి మంత్రిగా,కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారన్నారు.ఇక నల్లారి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కొని శభాష్ అనిపించారన్నారు.2019 నుండి 2024 వరకు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సర్వశక్తులు ఒడ్డి టిడిపి ఉనికిని కాపాడారని కొనియాడారు.ఎమ్మెల్యేగా పీలేరు నియోజకవర్గాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తూ,జాతీయ కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారని,తద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ బాబుల ప్రశంసలు అందుకుంటున్నారన్నారు.కార్యకర్తలకు అన్నివేళలా అండగా నిలుస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారన్నారు.నిరంతరం ప్రజా సంక్షేమం,కార్యకర్తల శ్రేయస్సు కోసం పనిచేసే కిషోర్ కుమార్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.రాజకీయాల్లో తనకు అత్యంత సన్నిహితుడని,ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ యమాల సుదర్శనం,టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు,అధికార ప్రతినిధి విజయమ్మ,మాజీ సర్పంచ్ రాజన్న,వెంకటరమణ నాయుడు,ప్రతాప్,ఎంపిల్ రెడ్డెప్ప,వెంకటేష్,దేవకి,విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News