Sunday, 13 September 2026 03:48:19 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మిట్స్ లో జనరేటివ్ ఏఐ లీడర్‌షిప్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌ - 2026

ఐ.ఎస్.టి.ఈ స్టూడెంట్స్ చాప్టర్ & గూగుల్ క్లౌడ్ వారి సహకారంతో లీడర్ షిప్ కార్యక్రమం

Date : 20 January 2026 06:20 PM Views : 278

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 20 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు మిట్స్ ఐ.ఎస్.టి.ఈ స్టూడెంట్స్ చాప్టర్ మరియు గూగుల్ క్లౌడ్ వారి సహకారంతో జనరేటివ్ ఏఐ లీడర్‌షిప్ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హైదరాబాద్ కు చెందిన ఎల్4జి (L4G) కంపెనీ ట్రైనర్లు వెంకటేష్.ఎల్ మరియు గోపీనాథ్.ఏ పాల్గొని విద్యార్థులకు జెనరేటివ్ ఏఐ పై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్. కుసుమ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జెనెరేటివ్ ఏఐ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు (AI) సమాచారం మాత్రమే విశ్లేషిస్తే, జెనరేటివ్ ఏఐ మాత్రం కొత్త ఆలోచనలు మరియు కొత్త సమాచారాన్ని తయారు చేస్తుంది అని అన్నారు. అందువల్ల విద్య, పరిశ్రమలు, వ్యాపారం మరియు సృజనాత్మక రంగాల్లో జెనరేటివ్ ఏఐ ఒక కీలక సాంకేతిక పరిజ్ఞానంగా ఉపయోగపడుతోంది అని అన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జెనరేటివ్ ఏఐ ను ఉపయోగించి పరిశ్రమలు మరియు వ్యాపార రంగాల్లో నివేదికలు తయారు చేయడం, డేటాను విశ్లేషించడం, కొత్త ఉత్పత్తుల ఆలోచనలు రూపొందించడం వంటి పనులను తక్కువ సమయంలో పూర్తి చేయడంలోను మరియు సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్, సమస్యలను గుర్తించడం, కొత్త అప్లికేషన్లు అభివృద్ధి చేయడంలో జెనరేటివ్ ఏఐ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. నూతన టెక్నాలజీ లకు ఇన్ ఫుట్ సాధనాలను ఎలా ఇవ్వాలి, ఏఐ పరికరాలను ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై విద్యార్థులను 8 బ్యాచ్‌లుగా నిర్వహించి, దాదాపు 500 మందికి పైగా విద్యార్థులకుశిక్షణను అందించారు. జెనరేటివ్ ఏఐ మానవ సామర్థ్యాలను పెంచి, ఉత్పాదకతను మెరుగుపరుస్తూ, భవిష్యత్తు ఉద్యోగాలు మరియు సాంకేతిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ డాక్టర్ ఎం. కిరణ్ కుమార్, ఆర్.రూప, అధ్యాపకులు మరియు విద్యార్థులు, పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: