Tuesday, 15 September 2026 08:53:43 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ప్రిడిక్టివ్ సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్

Date : 14 November 2025 04:46 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 14 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ ) విభాగం వారు "డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ప్రిడిక్టివ్ సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్" అనే అంశం పై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సప్తగిరి ఏలుమలై, సీనియర్ నెటవర్క్ & సెక్యూరిటీ లీడ్, ఆల్ఫా డేటా ఎల్.ఎల్.సి, అబుదాభి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ రంగంలో పెరుగుతున్న ముప్పులను ముందస్తుగా గుర్తించడంలో డీప్ లెర్నింగ్ మోడల్స్ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఆధునిక సైబర్ దాడులు క్రమంగా సమస్యాత్మకంగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న భద్రతా ప్రమాణాలు మాత్రమే సరిపోవని, సమస్యలను ముందుగా గ్రహించగలిగే మేధస్సు కోసం డీప్ లెర్నింగ్ మోడల్స్ కీలకమని తెలిపారు. న్యూరల్ నెట్‌వర్క్‌లు, LSTM, CNN, ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి, దాడులను ముందే అంచనా వేసి భద్రతను పెంపొందిచవచ్చని అన్నారు. ఈ సాంకేతికతలు క్రమబద్ధమైన డేటాను సమర్థవంతంగా విశ్లేషించడానికి మరియు అంచనా వేయడానికి రూపొందించబడింది అని, దీని సహాయంతో నెట్‌వర్క్ ట్రాఫిక్‌లో కనిపించే నమూనాలు, అసాధారణ ప్రవర్తనలు, కొత్తగా ఉద్భవించే సైబర్ ముప్పులను గుర్తించడం చాలా సులభం అవుతుందని అన్నారు. కంప్యూటర్, మొబైల్, అప్లికేషన్‌లలో ఉన్న భద్రతా లోపాలను గుర్తించి హ్యాకర్లు దాడి చేయకుండా ఉండేందుకు యాంటీవైరస్, ఫైర్వాల్ సాఫ్ట్‌వేర్‌లను మరియు పాస్వర్డ్ లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం ద్వారా సైబర్ దాడులను అరికట్టవచ్చని అన్నారు. విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ రంగంలో పరిశోధనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని, ఇటువంటి ఆధునిక సాంకేతిక శిక్షణలు వారి భవిష్యత్తు కెరీర్‌కు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్స్ వి.శివరామన్, ఎన్.గీతాంజలి, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: