నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సంబేపల్లి - ఫిబ్రవరి 05: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుడియవాండ్లపల్లి లోని హరిజనవాడలో జరుగుతున్న అక్షర ఆంధ్ర - ఉల్లాస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఏ మెప్మా వంటి శాఖల సమన్వయంతో 15 సంవత్సరాల పైబడిన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్ హెచ్ జి లబ్ధిదారులు, ఆయాలు, వంట వండేవారు, వివిధ రకాల సహాయకులు, వివిధ కార్యాలయాల కాపల దారులు, తదితరులను అక్షరాస్యులుగా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్..... "అక్షర ఆంధ్ర - ఉల్లాస్" కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ హెచ్ జి సంఘం సభ్యులతో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం ఎప్పుడు ఏర్పాటు అయ్యింది, ఎంత కాలం నుండి అక్షర ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు, కార్యక్రమాన్ని ఏ ఏ రోజులలో నిర్వహిస్తున్నారు, కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఎస్ హెచ్ జి గ్రూపులోని వారందరికీ చూపిస్తున్నారా లేదా, కార్యక్రమంలో ఎన్ని గంటల పాటు చదువుకుంటున్నారు వంటి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు అక్షరాస్యులుగా అయ్యేందుకు ఈ కార్యక్రమంలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Admin
Namitha News