Friday, 19 June 2026 03:19:27 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలను జయప్రదం చేయండి

140 వ "మే డే" ఉత్సవాలను జయప్రదం చేయండి

Date : 25 April 2026 03:20 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 25 : ఈనెల 26వ తేదీ నుండి 28 వరకు తిరుపతి మహానగరంలో జరుగుతున్న ఏఐటియుసి18వ రాష్ట్ర మహాసభలను మరియు మే నెల ఒకటవ తేదీన జరిగే ప్రపంచ కార్మిక దినోత్సవమైన 140 వ "మే డే" ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏఐటియుసి ఉమ్మడి చిత్తూరు జిల్లా సమితి మాజీ అధ్యక్షులు ఎస్. మనోహర్ రెడ్డి,ఏఐటీయూసీ మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బి.కొత్తకోట పట్టణంలోని అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం, స్థానిక పిటిఎం రోడ్డు నందు గల కార్యాలయంలో ఎం.అష్రఫ్ అల్లీ అధ్యక్షతన జరిగింది.ఈ యొక్క సమావేశానికి హాజరైన వారు మాట్లాడుతూ;ఈనెల 26వ తేదీ ఆదివారం తిరుపతి నగరంలో కార్మికుల ర్యాలీ,బహిరంగ సభలు జరుగుతున్నాయని,ఈ ర్యాలీ,బహిరంగ సభలో కార్మిక వర్గం ఎక్కువగా పాల్గొనాలని అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మే డే ను పురస్కరించుకొని మే నెల ఒకటవ తేదీన బి.కొత్తకోటలోని పిటిఎం రోడ్డు నందుగల జెండా దిమ్మెవద్ద,అరుణపతాకావిష్కరణ అనంతరం పట్టణంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని,ఈ యొక్క ఉత్సవాలకు బి.కొత్తకోట ప్రాంతంలోని అన్ని కార్మిక సంఘాల నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కదం తొక్కాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. బి.కొత్తకోట పట్టణంలోని భవననిర్మాణ,హమాలీ,రిక్షా,లైట్ మోటార్ వెహికల్స్,టైలర్స్,పెయింటర్స్,కార్పెంటర్స్,రాడ్ బెండర్స్,వెల్డర్స్, డొమాస్టిక్,హాకర్స్,స్ట్రీట్ వెండర్స్ తదితర అసంఘటిత రంగ కార్మికులు అను నిత్యం ఎదుర్కొంటున్న ఇండ్ల స్థలాలు,పక్కా గృహాలు, రేషన్ కార్డులు,పింఛన్లు, పార్కింగ్ స్థలాలు,కూలీల పెంపుదల,దినసరి గేటు తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం అంతా ఐక్య పోరాటాలకు శ్రీకారం చుట్టాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ నాయకులు యస్.తంబయ్యశెట్టి,హమాలీ యూనియన్ నాయకులు ఎం.అష్రఫ్అల్లీ,కె.రామాంజులు,ఎం.గంగులప్ప లు, టైలర్స్ యూనియన్ నాయకులు ఎస్.ఆజాద్,వి.రాము లు, లైట్ మోటార్ వెహికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కే.సురేంద్రరెడ్డి ఎస్.ఆరున్ లు,పెయింటర్స్ యూనియన్ నాయకులు ఎస్.జవహర్ బాబు,వీధి వ్యాపారుల యూనియన్ నాయకులు ఎం.సయ్యద్ భాష,బి.ఫర్విజ్ అహ్మద్, కే.నరసింహులు,తాపీ మేస్త్రీల సంఘం నాయకులు టి.ప్రసాద్,బి.రామచంద్ర లు,డొమాస్టిక్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్.ప్రభావతి తదితరులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :