నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అక్రమంగా చింత చెట్లులను తొలగిస్తున్న వ్యక్తి పట్టించుకోని ఫారెస్ట్ , రెవెన్యూ అధికారులు.. మదనపల్లె మండలం, బెస్తపల్లిలో చింత చెట్లను అనుమతి లేకుండా నరుకుతున్నా రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామానికి చెందిన పలువురు మీడియాతో మాట్లాడుతూ..ఓ పార్టీ నాయకుడు సుమారు 500ఏళ్లకు పైగా వయసున్న పెద్ద చెట్టును ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నరికించడం ఏంటని ప్రశ్నించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
Reporter
Namitha News