Saturday, 12 September 2026 02:48:10 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మె కు పిలుపు

Date : 08 February 2026 08:53 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 08 : వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో ముంచుతున్న మోడీ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో గ్రామీణ పేదలంతా పాల్గొని జయప్రదం చెయ్యాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేదలకు ఆసరాగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి పేదల పొట్టగొట్టే వి.బి.జి.ఆర్.ఎ.ఎ.ఎం.జి పేరుతో కొత్త చట్టం తెచ్చిందని అన్నారు. కార్మిక వర్గం పోరాటాలతో సాధించుకున్న 29 చట్టాలను 4 కోడ్లుగా కుదించారని అన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సుధీర్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆసరాగా గ్రామ సీమల అభివృద్ధికి దోహదపడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పులిమి వెంకటరమణ, గాలివీటి రామాంజులు, చుక్క వీరభద్ర, వండాడి రెడ్డి సుధాకర్, పరసా రెడ్డి ప్రసాద్, చాగలేటి ఆంజనేయులు, బాబు రమేష్, మక్ధూమ్ బాషా, రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :