Sunday, 13 September 2026 07:58:02 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026 మొందోస్తు సన్నాహక చర్యలను వేగవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

సి.యస్. మరియు ప్రధాన ఎన్నికల అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులకు SIR పై దిశానిర్దేశం

Date : 26 May 2026 08:07 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26: జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026 ముందస్తు సన్నాహక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–2026) కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న సన్నాహక చర్యలపై మంగళవారం సాయంత్రం విజయవాడ నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నమోదు అధికారులు (EROs), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs), బూత్ లెవల్ అధికారులు (BLOs) నియామకం, శిక్షణ కార్యక్రమాలు, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ మరియు పంపిణీ, BLO కిట్ల అందజేత, BLOలకు గౌరవ వేతనాల చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. అలాగే వాలంటీర్ల నియామకం, హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ తదితర అంశాలపై జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. వీసి అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ... ప్రత్యేక సవరణ ప్రక్రియను సమయపాలనతో పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఓటరిని జాబితాలో నమోదు చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టి, ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, నియోజకవర్గ ఈఆర్వోలు, సంబంధిత రెవెన్యూ మరియు ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :