నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 02 : నాడు-నేడు విద్యా ప్రమాణాలు, విద్యార్థుల శైలి పై నిర్మిస్తున్న లాస్ట్ బెంచ్ డైరీ సినిమా భావితరాల విద్యార్థులకు ఓ మార్గదర్శినిగా నిలుస్తుందని సినిమా హీరో కొలిమి ఫకీరయ్య తెలిపారు. బుధవారం ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు సూర్యుడు నాయక్, నిర్మాత రూపశ్రీ, సినిమా రైటర్ చంద్రకాంత్ లు తంబళ్లపల్లెలో పర్యటించారు. ఈచిత్ర నిర్మాణానికి అనువైన ప్రదేశాలను అన్వేషించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఉషారాణి ని కలిసి సినిమా కథాశం వినిపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ లాస్ట్ బెంచ్ డైరీ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్, ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ గోపీనాథ్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News