Saturday, 12 September 2026 04:42:54 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మల్లయ్య కొండ పై మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

మహాశివరాత్రి మహోత్సవం ను అధికారులు, పోలీసులు సమన్వయంతో నిర్వహించండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Date : 13 February 2026 11:17 PM Views : 305

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 13 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె మల్లయ్య కొండ మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష అనంతరం మల్లయ్య కొండలో డి.ఎస్.పి మహేంద్ర తో కలిసి పర్యటించారు. కొండకు వచ్చే వేలాది మంది భక్తులకు తాగునీరుతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్తు, మరుగుదొడ్లు ఏర్పాట్లు,మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు, క్యూ లైన్ల భారీ కేడ్లు ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ విషయంలో పోలీసులు, వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.భక్తులకు అత్యవసర చికిత్సల కోసం ఉచిత వైద్య శిబిరంతో పాటు అత్యవసర అంబులెన్స్ అందుబాటు లో ఉండేలా చూడాలన్నారు, ఫారెస్ట్ అధికారులు కొండపై ధూమపానం, మద్యపానం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అగ్ని ప్రమాదాల పై అప్రమత్తంగా ఉండి ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచాలన్నారు.రాత్రిపూట భోజన వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. కొండ మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పఠిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేయాలన్నారు.మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొండ కింద అన్నదాన శిబిరాన్ని పరిశీలించి కమిటీ సభ్యులను ప్రశంసించారు. కొండకు వెళ్లే రవాణా బస్సుల వివరాలను అడిగి తెలుసుకుని ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్ సమస్య,భద్రత పై ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆమె వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ రమణారెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎస్సై అనిల్ కుమార్, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీధర్ నాయుడు, ఈఓ ముని రాజా, కొండకిట్ట,ఏఈ సురేంద్ర, వినోద్ కుమార్, రమణ, మండల స్థాయి అధికారులు, అన్నదాన కమిటీ సభ్యులు,టిడిపి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :