నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 29 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు బి.టెక్ మెకానికల్ మరియు డేటా సైన్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రెండవ సంవత్సర విద్యార్థులు తెలివైన ఆటోమేషన్ మరియు డేటా-ఆధారిత పద్ధతుల ద్వారా సాంప్రదాయ పట్టు వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించే లక్ష్యంతో, “సెరికల్చర్ ఐఓటి అనే పరిశోధన పత్ర ప్రదర్శనలో ప్రతిభ కనపరిచి మొదటి బహుమతి పొందినట్లు వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. చిత్తూర్ లోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ కళాశాలలో ఇటీవల జాతీయ స్థాయిలో అన్వేషణ - 2026 పోటీలలో షేక్ ఎం.డి జైద్, పి.మోహీం ఖాన్ (మెకానికల్), షాహిద్ అలీషా (డేటా సైన్స్) లు వివరించిన పరిశోధన పత్రానికి మొదటి బహుమతి లభించినట్లు ఆయన అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్. యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్ తదితరులు అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News