Monday, 08 June 2026 09:53:35 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

ముత్యపు పందిరి పై ఊరేగిన సర్వభూపాలుడు

Date : 21 January 2026 08:39 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 21 ః తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి లో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ టిటిడి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సర్వభూపాలుడు ఉదయం ముత్యపు పందిరి వాహనం, సాయంత్రం సింహవాహనంపై ఊరేగారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేక పూజలు, అర్చనలు, ధూప దీప నైవేద్యాలు అనంతరం ముత్యపు పందిరిపై స్వామివారిని మాడవీధుల్లో మంగళ వాయిద్యాలు, హరినామ సంకీర్తనల మధ్య ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని పలు రకాల పుష్పాలతో అలంకరించిన సింహ వాహనంపై స్వామివారు విహరించారు. తదుపరి పంచామృతం, చందనం పసుపులతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో టిటిడి అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి బృందం తో పాటు ఆలయ అధికారులు కృష్ణమూర్తి, నగేష్, మురళి స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :