Sunday, 13 September 2026 04:41:03 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సైబర్ సెక్యూరిటీ లో కృత్రిమ మేధస్సు ప్రాముఖ్యత పై అవగాహనకల్పించిన మిట్స్ విద్యార్థులు

Date : 21 November 2025 05:25 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 21 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ ) విభాగం వారు సైబర్ సెక్యూరిటీ రంగంలో కృత్రిమ మేధస్సు యొక్క ప్రాముఖ్యత అనే అంశం పై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నై కి చెందిన జోహో కార్పొరేషన్ రీజినల్ మేనేజర్, ఆనంద్ పళనిసామి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆనంద్ పళనిసామి మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సైబర్‌ సెక్యురిటీ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సు ఆధారిత యంత్రాలు, అల్గోరిథములు, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ మోడళ్ళ ద్వారా సైబర్‌ దాడులను ముందుగానే గుర్తించి అడ్డుకునే రక్షణ కవచంగా పనిచేస్తాయని, నెట్‌వర్క్‌లలో అనుమానాస్పద మరియు అసాధారణ ప్రవర్తనను గుర్తించడం, డేటా భద్రతను మెరుగుపరచడం, మోసపూరిత లావాదేవీలను నిరోధించడం, మాల్వేర్ దాడులను అడ్డుకోవడంలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ముఖ్య పాత్ర పోషిస్తోంది అని అన్నారు. అయితే ఇదే సాంకేతికతను సైబర్ నేరగాళ్లు కూడా ఆధునిక దాడుల కోసం వినియోగిస్తున్నారని. ఏ.ఐ ఆధారిత ఫిషింగ్ సందేశాలు, డీప్‌ఫేక్ వీడియోలు, ఆటోమేటిక్‌గా మార్పులు చెందే మాల్వేర్, సైబర్ దాడులు భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయని అన్నారు . అందువల్ల AI ఆధారిత రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు మరియు సైబర్‌ చట్టాలను మరింత కఠినతరం చేయడం అత్యవసరమని సూచించారు. రాబోయే డిజిటల్‌ భవిష్యత్తులో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ బాధ్యతాయుత వినియోగం ప్రపంచ సైబర్ భద్రతను నిర్ణయించాల్సి ఉంటుంది అని అన్నారు.విద్యార్థులు ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్త, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి, కోఆర్డినేటర్స్ కె.పి మణికందన్, ఎమ్.ముత్తరసు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: