Tuesday, 15 September 2026 09:37:25 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు - యం.వి.ఐ. సుప్రియ

జిల్లా ట్రాన్స్ పోర్టు కమిషనర్ వారి ఆదేశాల మేరకు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ప్రత్యేక తనిఖీలు

Date : 12 May 2026 08:22 AM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 12 : పాఠశాలల విద్యార్థుల భద్రత కోసం జిల్లా ట్రాన్స్ పోర్టు కమిషనర్ అధికారుల ఆదేశాల మేరకు పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సుప్రియ స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వాంచారు. పుంగనూరు పట్టణం లోని పలు స్కూల్ బస్సుల యొక్క ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ లైసెన్స్, వేగ నియంత్రణ పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు, మరియు అత్యవసర ద్వారాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీలలో ప్రధాన అంశాలు ప్రతి బస్సుకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్ నెస్ సర్టిఫికెట్, బ్రేక్‌లు, టైర్లు, హెడ్‌లైట్లు, మరియు వైపర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని స్వయంగా పరిశీలించారు. భద్రతా పరికరాలైన అగ్నిమాపక యంత్రం, ప్రథమ చికిత్స కిట్ బస్సులో అమర్చారా, అందులో ప్రథమ చికిత్స మెడిసిన్ అందుబాటులో ఉందా లేదా అంటూ తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు, విండోలు సులభంగా తెరుచుకునేలా ఉన్నాయా లేవాని చూశారు.వేగ నియంత్రణ పరికరం,మరియు జీపీఎస్ పనితీరును తనిఖీ చేశారు.డ్రైవర్‌కు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందోనని,డ్రైవర్ కు గల అలవాట్లు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ హెవీ వెహికల్ లైసెన్స్ కాల పరిమితి ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎక్కే బస్ ఫిట్‌నెస్‌ను పాఠశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలని, బస్సులో తగినంత మంది సిబ్బంది (అటెండర్) ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :