Sunday, 13 September 2026 02:52:05 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధన కోసం రాజీలేని పోరాటం - మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సాకే శైలజానాధ్, ద్వారకనాథ్ రెడ్డి

Date : 31 March 2026 05:31 PM Views : 316

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 31 : కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం జీవనాడి అని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్, మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ అన్నారు. మంగళవారం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై‌ మదనపల్లె ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్య అతిధిగా విచ్చేసారు. ‌మాజీ మంత్రి సాకే శైలజానాధ్, రాజంపేట ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గం నిస్సార్ అహమ్మద్, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లె నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి, నల్లారి తిమ్మారెడ్డి, పీలేరు ఇక్భల్ అహమ్మద్, ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు హజరైనారు. ముందుగా నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరించారు. వారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించడం జరిగింది. కూటమి ప్రభుత్వం సాగు నీరంటే పట్టింపు లేదని, వ్యవసాయం అంటే దండగ అన్న భావనలో ఉన్నారన్నారని విమర్శలు గుప్పించారు. స్వప్రయోజనాలు తప్ప రైతాంగానికి మేలు చేసే ప్రజా సమస్యలపై మాట్లాడలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల కోసం, కృష్ణా పరివాహక ప్రాంత ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ తీవ్ర పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో ఆంధ్ర సిఎం చంద్రబాబునాయుడు కుమ్మక్కై ప్రాజెక్టును ఆపేయడం దారుణమన్నారు.‌ రాయలసీమ లిఫ్ట్ వల్ల వచ్చే 22 టీఎంసీలతో ఏం లాభమని ఇరిగేషన్ మంత్రి మాట్లాడడం దారుణమన్నారు. హంద్రీ-నీవా నుంచి గాలేరు-నగరికి ఉన్న లింక్ కెనాల్ కూడా పూర్తి చేయడం లేదని విమర్శలు గుప్పించారు. తమ భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసే రాయలసీమ వ్యతిరేక నిర్ణయాలను సహించబోమని, కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని, పార్టీలకు అతీతంగా కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: