నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 25 : తంబళ్లపల్లె మండలం లో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడుతోందని దీనిని అధిగమించడానికి భూగర్భ జలాలు పెంపుకు మహిళా సంఘాలు సైతం నడుం బిగించాలని ఏపిఎం గంగాధర్ పిలుపునిచ్చారు. మంగళవారం మహిళా సంఘాలతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎల్ నేను ప్రభావంతో రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు ఇంకి సాగునీరు, తాగునీటికి తీవ్ర సమస్యలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని ముందస్తుగా భూగర్భ జలాలు పెంపు కోసం జల సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు, పూడిక తీత పనులు, ట్రెంచిలు, పలు జల సంరక్షణ పనులపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా రైతులకు ట్రాక్టర్ తో పాటు నా గళ్ళు అందుబాటులో ఉన్నాయని మహిళా సంఘాలు అవసరమైన రైతులకు తక్కువ అద్దెతో ఉపయోగించుకోవాలని సూచించారు. మండలంలోని మహిళా సంఘాలు సమిష్టి కృషితో ఎల్ నినో ప్రభావం పడకుండా ముందస్తు ప్రణాళికలతో జల సంరక్షణ పనులపై సమిష్టి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు కత్తినరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామలక్ష్మమ్మ, మహిళా సంఘాలు పాల్గొన్నారు
Reporter
Namitha News