Thursday, 30 July 2026 01:34:36 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జెఎన్టియూ అనంతపురం యూనివర్సిటీ టీమ్స్ కి విశ్వం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎంపిక

Date : 09 December 2025 12:57 PM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జెఎన్టియూ అనంతపురం యూనివర్సిటీ టీమ్స్ కి విశ్వం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎంపిక అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జేఎన్టీయూ యూనివర్సిటీ అనంతపురం వాలీబాల్ మరియు బాస్కెట్బాల్ కు ఎంపిక జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు ఎన్ బి కే ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో జేఎన్ టియూ అనంతపురం పరిధిలో జరిగిన వాలీ బాల్ పోటీలో విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ సిఎస్ఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అబ్దుల్ మహమ్మద్ షమీర్ మరియు నంద్యాల ఆర్.జి.ఎం ఇంజనీరింగ్ కాలేజీ లోజరిగిన బాస్కెట్ బాల్ సెలక్షన్ లో విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ బి. టెక్ సెకండ్ ఇయర్ ఈఈఈ విద్యార్థి హేమంత్ కుమార్ యూనివర్సిటీ తరఫున ఆడే మెయిన్ టీమ్స్ కు ఎంపిక అయినట్లు తెలియజేశారు. ఇంకా కాలేజీ నందు ఎక్కువ మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కళాశాల ఫీజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎం. మహేంద్ర రెడ్డి, ఆర్. రాజ్ కుమార్ మరియు ఏ. సురేష్ మాట్లాడుతూ నిరంతర శిక్షణ మరియు పట్టుదల ద్వారా విద్యార్థులు ఆటల పోటీలలో విద్యార్థులు విజయం సాధిస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా కాలేజ్ మేనేజ్మెంట్ శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ టీఎస్ గౌస్ బాషా, అన్ని విభాగాల డీన్స్, హెచ్ఓడి లు మరియు విద్యాపకులు ఎంపికైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము ఈ బంగారు అవకాశాల్ని సద్వినియోగం పరుచుకుంటామని తెలియజేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :