నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 14 : భోగి పండుగ సందర్భంగా కోడి పందాలు రూపంలో జూదమాడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై టి అనిల్ కుమార్ విలేకరులకు తెలిపారు. తంబళ్లపల్లె మండలం జుంజురపెంట గ్రామం చిన్న మూలకుంట చెరువు వద్ద జూదమాడుతున్న 11 మంది ని ఎస్సై టి.అనిల్ కుమార్ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. వారి పై కేసు నమోదు చేసి నిందితుల నుండి రూ 5900 సొమ్ము తోపాటు ఐదు మొబైల్ ఫోన్లో నాలుగు కోడిపుంజులు స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా జూదం, కోడి పందాలు, బహిరంగ మద్యపానం చేస్తే ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు
Reporter
Namitha News