నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లె - నవంబర్ 27 ః తంబళ్లపల్లె మండలం లో అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేయాలని హౌసింగ్ డిఇ వెంకటరెడ్డి లబ్ధిదారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన కొటాల, ఆర్ఎన్ తాండ లేఔట్లలో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇండ్లు పూర్తి చేసుకోకపోతే నష్టపోతారని త్వరగా ఇండ్లు నిర్మించుకుంటే బిల్లులు వెంటనే చెల్లిస్తామని హితవు పలికారు. అసంపూర్తి ఇండ్ల లబ్ధిదారుల సమస్యల పై ఇంజనీరింగ్ అసిస్టెంట్లు దృష్టి సారించి వారికి సహకరించాలన్నారు. మండలంలో గతంలో ఇండ్లు మంజూరు కాని అర్హులైన లబ్ధిదారులు పక్కా గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ సుజాత, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శేషాద్రి, పక్కా ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News