Tuesday, 15 September 2026 10:47:17 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

ముద్దల దొడ్డి లో దేవర ఎద్దు మృతి ఘనంగా అంత్యక్రియలు

Date : 08 January 2026 08:08 PM Views : 520

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 08 ః తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి (బాలిరెడ్డిగారిపల్లి) పంచాయతీ ఎగువ ముట్ర వారి పల్లి కు చెందిన ముట్ర కుటుంబాలకు చెందిన దేవర ఎద్దు బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. గత పది రోజులుగా ఎద్దు కు కంటి వద్ద గాయమై అస్వస్థతకు గురి అయింది. మెరుగైన చికిత్సలు చేయించిన ఫలితం లేక ఎద్దు మృతి చెందడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గ్రామ దేవతగా పూజిస్తున్న దేవరఎద్దు మృతితో ముద్దల దొడ్డి పంచాయతీ మూగబోయింది.గురువారం ముట్రవారి దేవర పెద్ద కె. నరసింహారెడ్డి, దేవర ఎద్దు భక్తుడు ఎం. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హిందూ సంస్కృతి సాంప్రదాయ బద్దంగా దేవర ఇంటి వద్ద ఎద్దు మృతదేహానికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. వందలాదిగా ముట్ర కుటుంబీకులు, మహిళలు, ప్రజలు దేవర ఎద్దు కు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ట్రాక్టర్ లో ఊరేగింపుగా దేవర ఎద్దును ఊరేగించి ఖననం చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేలుళ్లు, డప్పులు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దేవర ఎద్దును అశ్రు నయనాలతో సాగనంపారు. ఈ కార్యక్రమానికి ముద్దలదొడ్డి పంచాయితీ తోపాటు మండలంలోని పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరై దేవరెద్దు అంత్యక్రియల్లో పాల్గొనడం విశేషం.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :