Saturday, 12 September 2026 12:08:14 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం

Date : 11 September 2026 05:38 PM Views : 19

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం మదనపల్లె : ఏపీ ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్,టిడిపి రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి,ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),టిడిపి పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజతో కలిసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా తులసి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ సోదరులకు మట్టి వినాయక ప్రతిమలు,మొక్కలను అందజేస్తూ పఠాన్ ఖాదర్ ఖాన్ గొప్ప మనసును చాటుకుంటున్నారన్నారు.అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ఆదిదేవుడైన వినాయకుడికి తొలి పూజలు అందించడం ఆనవాయితీ అని,అటువంటి పండుగ నిర్వహణకు ముస్లిం సోదరులు ముందు ఉండడం శుభసూచకన్నారు.ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పఠాన్ ఖాదర్ ఖాన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు.అనంతరం నాగూర్ వలి మాట్లాడుతూ మతసామరస్యానికి మదనపల్లి పట్టణం ఆదర్శంగా నిలుస్తోందని,ముస్లిం,హిందువులు ఐకమత్యంతో ముందుకు సాగడమే ఇందుకు నిదర్శనమన్నారు.అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పఠాన్ ఖాదర్ ఖాన్ గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారన్నారు.ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 13వ తేదీ అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు తాజ్ హోటల్ ప్రక్కన మట్టి వినాయక ప్రతిమలు,మొక్కలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని,కావున టిడిపి నాయకులు,కార్యకర్తలు,ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: