నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వ్యవసాయ రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన జిల్లా అధికారులు నిమ్మనపల్లి.. జాతీయ నులిగింజల మిషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారి అధ్యక్షతన శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రైతులు స్వయంగా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసుకోవడం (Own Seed Production) యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రాబోయే పంటకాలంలో ఎల్‌నినో (El Niño) ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వర్షాకాలానికి ముందే పొడి విత్తనం (Pre-monsoon Dry Sowing) చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. చిన్న విత్తనాలకు పెలెటైజేషన్ (Pelletization) చేసి పొలంలో వెదజల్లడం (Broadcasting) ద్వారా తొలి వర్షాలు కురిసిన వెంటనే అవి మొలకెత్తి భూమంతా పచ్చదనంతో కప్పబడుతుందని, ఇది పశువులకు మేతగా ఉపయోగపడటంతో పాటు నేల తేమను సంరక్షించడంలో సహాయపడుతుందని తెలిపారు. తగిన మోతాదులో వర్షపాతం నమోదైతే మంచి పంట దిగుబడి సాధ్యమవుతుందని వివరించారు. అనంతరం డ్రమ్ సీడర్ పద్ధతిలో సాగు చేసిన వరి పొలాన్ని సందర్శించి, అక్కడ అమలు చేస్తున్న సహజ వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. రైతులు అనుసరిస్తున్న సహజ సాగు విధానాలను అభినందిస్తూ, స్థిరమైన వ్యవసాయానికి ఇటువంటి పద్ధతులు ఎంతో ఉపయోగకరమని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మంజుల సిబ్బంది రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News