నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 01 : అన్నమయ్య జిల్లా డిమాండ్ల ను వెల్లడించిన సీపీఐ జిల్లా నాయకులు జిల్లాకు కడప నుండి రాయచోటి, మదనపల్లె మీదుగా బెంగుళూరు కు పాత అలైన్ మెంట్ రైల్వే లైన్ ను ఏర్పాటు చేయాలి: —* నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, పారిశ్రామిక రంగాలను నెలకొల్పాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి పీ. మహేష్ డిమాండు: ..... బద్లావ్ జరూరీ హై నినాదంతో ఛలో ఢిల్లీ కి సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా నుంచి దాదాపు వందమందికి పైగా సీపీఐ నాయకులు బయల్దేరి వెళ్లారు. సెప్టెంబర్ 1 న రామ్ లీలా మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభ కు అన్నమయ్య జిల్లా సీపీఐ నాయకులు ర్యాలీగా బయలుదేరి వెళ్లే సభను జయప్రదం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పీ మహేష్ మాట్లాడుతూ... నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పన్నెండేళ్ళు అయినా దేశానికి ఒరిగిందేమీ లేదని దేశ ప్రజలను పక్కనపెట్టి కార్పొరేట్ వారికి ఊడిగం చేయడమే పరమావరి అయిపోయిందని దేశంలో అన్నం పెట్టే రైతన్న నుండి చదువుకుంటున్న విద్యార్థుల వరకు ఎవరికీ ఎటువంటి లాభం చేకూర్చలేదని ఇప్పటికీ అన్నమయ్య జిల్లాకు చేసింది శూన్యం అన్నారు. అసలే కొత్తగా విడిపోయిన జిల్లా అన్ని రకాలుగా ముందుకు వెళ్లాలి అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎంతైనా అవసరం అన్నారు. కడప నుంచి అన్నమయ్య జిల్లా లోని లక్కిరెడ్డి పల్లె,రాయచోటి, గుర్రం కొండ, మదనపల్లె మీదుగా బెంగుళూరు కు రైల్వే లైన్ ను వేయడం వల్ల ఈ ప్రాంతంలోని రైతులు తాము పండించిన పంట ను పక్క రాష్ట్రంలోకి వెళ్లి అమ్ముకోవడానికి సులభతరం అవుతుందన్నారు. అలాంటి సదుపాయం కలిగిన రైల్వే లైన్ ను గత వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ ను సాకుగా చూపించి నిలిపివేసిందని, అందుకు నిరసనగా సీపీఐ కూడా పాదయాత్ర నిర్వహించిందన్నారు.అంతేగాకుండా, నిరంతరం ఈ రైల్వే లైన్ కోసం సందర్భం వచ్చినప్పుడల్లా సీపీఐ తన గళాన్ని వినిపిస్తూనే వుందన్నారు. దీనితో పాటు మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వెనక్కు తీసుకోవాలని, రాష్ట్రానికి సంబంధించిన విభజిత హామీలను నిధులను కేంద్రమే భరించాలన్నారు.అంతే గాకుండా, బీజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే తప్ప, ఎక్కడా తగ్గిన పాపాన పోలేదు అని అన్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ప్రజల ను దోచుకుతింటారు అనీ,అందుకే మార్పు కావాలి _ మార్పు రావాలి అనే నినాదం తో ప్రజల పక్షాన సీపీఐ బీజేపీ ప్రభుత్వం ను గద్దె దించటానికి నడుం బిగించిందన్నారు. అందులో భాగంగా ఆగస్టు నెల అంతా ప్రజల వద్దకు పాదయాత్రల పేరుతో వారి సమస్యలను గుర్తించడానికి పాదయాత్ర నిర్వహించి స్థానికంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి చివరిగా బద్లావ్ జరూర్ హై అని సీపీఐ నాయకులు ఇచ్చిన నినాదాల తో దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి మారుమ్రోగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టీ. కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. మురళీ, శ్రీనివాసులు, సుమిత్రమ్మ, టి .ఎల్ .వెంకటేష్, తో పాటు ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయన్, జక్కల వెంకటేష్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి కె. మాధవ్, సిపిఐ నాయకులు అష్రఫ్ అలీ, ఆంజనేయులు, జగన్ బాబు, గంగాధర్, ,నిజాముద్దీన్, బాబు, గంగులప్పా, ఏఐటియుసి నాయకులు భాస్కర్,జానకమ్మ, ఇంద్రాణి, రాధమ్మ, కార్యకర్తలు, కార్మికులు, రైతులు, సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News