Saturday, 12 September 2026 07:13:21 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు

Date : 02 May 2026 09:09 PM Views : 387

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 02 : తంబళ్లపల్లె మండలం రెడ్డి కోట పంచాయతీ పరిధిలో మదనపల్లి కడప హైవే రోడ్డులో గొర్రెల బొలోరో వాహనం బోల్తా పడి ఇరువురు దుర్మరణం చెంది 6 మంది గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. కురబలకోట మండలం అంగళ్లు గొర్రెల సంత నుండి కలకడ మండలం పాపి రెడ్డిగారిపల్లెకు చెందిన గొర్రెల రైతులు గొర్రెలు కొనుగోలు చేసి ఓ బులోరా వాహనం లో పాపి రెడ్డి గారి పల్లెకు బయలుదేరారు. మదనపల్లి కడప జాతీయ రహదారి తంబళ్లపల్లి మండలం రెడ్డి కోట సమీపంలోని హైవే రోడ్డు పక్కన గల బ్రిడ్జిని బలోరో వాహనం అదుపుతప్పి ఢీకొని లోయలోకి పడిపోయింది.ఈభారీ రోడ్డు ప్రమాదంలో వాహనంలోని నజీర్ (53) సైఫుల్లా(23) అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన 6 మంది క్షతగాత్రులను గుర్రం కొండకు చెందిన 108 వాహనంలో చికిత్సల నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ములకలచెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరి, పెద్దమండెం ఎస్సై హరిహర ప్రసాద్ లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: