Monday, 14 September 2026 11:41:06 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

దేశ సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ మదనపల్లెలో ఘనంగా వర్ధంతి వేడుకలు

Date : 21 May 2026 04:05 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దేశ సాంకేతిక విప్లవానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ మదనపల్లెలో ఘనంగా వర్ధంతి వేడుకలు విశాలాంధ్ర, మదనపల్లి: దేశంలో శాస్త్ర సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసి, భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి నడిపించిన మహానేత స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్‌.రెడ్డీ సాహెబ్ కొనియాడారు. భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మదనపల్లె పట్టణంలోని ఇందిరా నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఎస్‌.అల్లా బకష్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌.రెడ్డీ సాహెబ్ మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్య, సాంకేతికత, టెలికమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశారని తెలిపారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఐటీ రంగానికి పితామహుడిగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడిగా ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. గ్రామ స్వరాజ్య సాధనకు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యంలో యువశక్తికి ప్రాధాన్యం పెంచారని తెలిపారు. సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న రాజీవ్ గాంధీ ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఈ రోజును దేశంలో ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత శక్తిపై అపార విశ్వాసం ఉంచిన మహానేతగా రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనా కుమారి, మాజీ మండలాధ్యక్షులు ముబారక్ ఖాన్, మాజీ డీసీసీ సెక్రటరీ డా.వర్ధన్ చౌదరి, మాజీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు సోమశేఖర్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ మహబూబ్ పేరా, మాజీ మహిళా టౌన్ ప్రెసిడెంట్ ఈశ్వరమ్మ, మాజీ మండల బీసీ సెల్ అధ్యక్షులు నాగరాజ, మాజీ టౌన్ సెక్రటరీలు పాలేటి, మహమ్మద్ అలీ, యూత్ కాంగ్రెస్ నాయకులు శరత్ కుమార్ రెడ్డి, మైనార్టీ నాయకులు యూసుఫ్ ఖాన్, ఇర్ఫాన్, దస్తగిరి ఖాన్, ఉస్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :