నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కూటమి సంక్షేమ పాలనకు జేజేలు పలుకుతున్న ప్రజలు - సూపర్ సిక్స్ పథకాలతో ఏపీలో నూతన శకానికి నాంది - ఎమ్మెల్యే షాజహాన్ బాషా,టిడిపి జిల్లా అధ్యక్షులు సుగవాసి స్పష్టం - 14వ వార్డులో అట్టహాసంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మదనపల్లె : కూటమి పాలనకు రాష్ట్ర ప్రజలు జేజేలు పలుకుతున్నారని,సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో సీఎం చంద్రబాబు ఏపీలో నూతన శకానికి నాంది పలికారని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా,తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబులు పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని సోమవారం 14వ వార్డ్ పరిధిలో వార్డ్ ఇంఛార్జ్,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆఫ్ శీనా) ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా,జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు,నియోజకవర్గం అబ్జర్వర్ నెట్టెం వెంకటేష్ లు ముఖ్య అతిథులుగా హాజరు కాగా నాగూర్ వలి వారికి ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి,ప్రజాసంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సంక్షేమ పథకాలను ప్రజలకు సకాలంలో అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,యువమంత్రి నారా లోకేష్ బాబులతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని ప్రశంసించారు.ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ,ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు,తల్లికి వందనం,స్త్రీ శక్తి,అన్నా క్యాంటీన్లు,ఎన్టీఆర్ గృహకల్ప,నేతన్న సేవలో వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని,ఈ పథకాలతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తం చేశారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారధ్యంలో అత్యంత పారదర్శకంగా 16 వేల పైచిలుకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తే,అందులో ఏవో అక్రమాలు జరిగిపోయాయని వైసిపి నాయకులు గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.వారు చేసిన అరాచకాలు,దౌర్జన్యాలను చూసి 2024లో 11 సీట్లకే పరిమితం చేశారని,ఇదే విధానాలను అవలంబిస్తే 2029లో ఆపార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం కాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ ఛైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,పట్టణ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ తేజ (చింటూ),వెంకటేశ్వరస్వామి గుడి చైర్మన్ గంగారపు నవీన్ చౌదరి,గంగారపు రామ్మూర్తి నాయుడు,గాంధీ,పట్టణ మహిళా అధ్యక్షరాలు రాటకొండ భారతి,బాలు స్వామి,రాటకొండ మధు బాబు,నాదెళ్ల రమేష్,రామ్మూర్తి,వెంకటేష్,పెరవలి మధు,తాళ్ల గిరి,బాబు నాయుడు,పూల మురళి,సోమశేఖర్,శ్రీరామ్ వినోద్,శ్రీరామ నాగమణి,మహిళా నాయకురాలు బైగారి భారతి నాయుడు,రాధమ్మ,పులి మహాలక్ష్మి,విజయమ్మ పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News