Sunday, 13 September 2026 04:51:18 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం - జిల్లా డిప్యూటీ సిఈవో మోహన్ రావు

Date : 18 December 2025 04:13 PM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - డిసెంబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులలో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.. అందులో భాగంగా మరో వంద రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ఉన్నందున పదో తరగతి విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ విద్యార్థులలో ఉత్తీర్ణశాతం పెంచేందుకు ప్రణాళిక రూపొందించింది. నేడు ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ రాజ్ జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఆత్మకూరు తాహసిల్దార్ పద్మజా, ఎంపీడీవో రఫీ ఖాన్, మండల MEO కె.చలపతితో పాటు మండలంలోని పదవ తరగతి విద్యార్థులు ఉన్న 13 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మరియు 13 పాఠశాలలకు ప్రత్యేకంగా నియమించబడిన 13 మంది ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈవో మోహన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడారు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా పదవ తరగతి విద్యార్థులలో చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేలా చర్యలు చేపట్టి ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం కోసమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా వివిధ శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని వీరు తరచూ పాఠశాలను సందర్శిస్తూ విద్యార్థులకు పలు సూచనలు చేస్తారని తెలిపారు.. తెలిపారు..పలువురు హెడ్మాస్టర్లు అడిగిన ప్రశ్నలకు మోహన్ రావు సమాధానం తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: