నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 12 : తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఓటర్ల సవరణ కార్యక్రమంలో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడానికి అధికార యంత్రాంగం పారదర్శకంగా పనిచేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీనివాసులతో కలిసి ఎస్ ఐ ఆర్ ఓటర్ల కార్యక్రమంలో అప్ డేట్ కాని ఓటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎన్నికల ఏ ఎల్ ఓ, బి ఎల్ వో లు పూర్తిస్థాయిలో పరిశీలన చేసి ప్రతి ఓటరును అప్డేట్ అవ్వడానికి కృషి చేయాలని సూచించారు. తమ ఓటరు జాబితాలో చేర్చడానికి ఓటర్లు కార్యాలయానికి చేరుకున్నారు. ఏ ఎల్ ఓ, వీఆర్వోలు ప్రతి ఓటర్ను నిశితంగా పరిశీలించి అప్డేట్ చేయడానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మారుతి కుమార్, మండలంలోని ఏఎల్ఓ, బి ఎల్ వో లు, ఓటర్లు పాల్గొన్నారు
Reporter
Namitha News