నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యుత్ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాం. రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయ మూర్తి. తంబళ్లపల్లె మండల కేంద్రంలోని విద్యుత్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని రిటైర్డ్ జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి హామీ ఇచ్చారు. గురువారం తంబళ్లపల్లె సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం ఆధ్వర్యంలో జరిగిన విద్యుత్ అదాలతో చైర్ పర్సన్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి తో పాటు సభ్యులు మధు కుమార్, శ్రీనివాసరాజు, విజయలక్ష్మిలు పాల్గొని విద్యుత్ వినియోగదారుల సమస్యలను సుదీర్ఘంగా విచారించారు. తంబళ్లపల్లె లో తరచూ విద్యుత్ లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి 132 కెవి సబ్ స్టేషన్ నిర్మాణం, డిజిటల్ బిల్లులు చెల్లింపులు వద్దని, విద్యుత్ శాఖ సెక్షన్ కార్యాలయం, క్రాస్ రోడ్ హాస్టల్ పరిధిలో లో వోల్టేజ్, సినిమా థియేటర్ వద్ద ట్రాన్స్ఫార్మర్ మార్పు, కోసువారిపల్లి సబ్ స్టేషన్ పరిధిలో లో వోల్టేజ్, సోలార్ విద్యుత్ పై అవగాహన కల్పించాలని, విద్యుత్ సిబ్బంది కొరత,ఇంకా పలు సమస్యలు వినియోగదారులు అదాలత్ దృష్టికి తెచ్చారు. మండలంలో ఇప్పటికే లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి విద్యుత్ శాఖ డి ఈ కృషిని వినియోగదారులు కొనియాడారు. విద్యుత్ అదాలత్ చైర్మన్ తో పాటు సభ్యులు సినిమా థియేటర్ వద్ద ట్రాన్స్ఫార్మర్ పరిశీలించారు. అనంతరం వారు అదాలత్ లో మాట్లాడుతూ ప్రతి విద్యుత్ సమస్యను పరిష్కారానికి విద్యుత్ సిబ్బంది కృషి చేయాలని సూచనలు చేశారు. సామాన్య మధ్యతరగతి వినియోగదారుల మైనర్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాల్సి ఉందని సూచించారు. భవిష్యత్తు లో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి సీఎం డి తో మాట్లాడి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విద్యుత్ అదాలత్ లో ఏడి గోవిందరెడ్డి, ఏఈ సురేంద్ర, జే ఏ ఓ బాబ్జాన్, పీటీఎం, మొలకలచెరువు, కొత్తకోట ఏ ఈ లు గిరి, శేషు, ముజుమిల్లా, ఎల్ ఐ లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్లు శంకర్, అప్పి రెడ్డి, అమీన్, ఇంతియాజ్, శ్రీకాంత్, ప్రసాద్, డివోభాస్కర్, రమేష్, ప్రవీణ్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News