నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య సంస్థ విద్యార్థుల నృత్య ప్రదర్శన అత్యద్భుతం - గురుపూజోత్సవంలో జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యేలచే ప్రశంసలు మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో చైతన్య సర్వీస్ సొసైటీ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన ప్రేక్షకులు,అహుతులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,మదనపల్లె శాసనసభ సభ్యులు షాజహాన్ బాషా,జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చైతన్య సర్వీస్ సొసైటీకి చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.విద్యార్థుల ప్రతిభను అభినందించిన అతిథులు,వారిని ప్రోత్సహించడంలో సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఇందులో భాగంగా చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రటరీ కవితారాణి,అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ జి.వి.ఎస్ బాబును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా సన్మానించి అభినందించారు.విద్యార్థుల విద్యా,సాంస్కృతిక వికాసానికి చైతన్య సర్వీస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి జిల్లా ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు.
Reporter
Namitha News