Saturday, 12 September 2026 07:24:25 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం : - సిపిఎం శ్రీనివాసులు

మహాత్మా గాంధీ కి ఘన నివాళి, ప్రతిజ్ఞ

Date : 30 January 2026 08:39 PM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 30 : కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన కొత్త పథకం కూలీల పొట్టకొడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఆరోపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మదనపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాలేసి వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధి చట్టాన్ని కాపాడు కుంటామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా కొత్త చట్టాన్ని రద్దు చేయిస్తా మని ఈసందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ జనవరి 30వ తేదీ మహాత్మా గాంధీని మతోన్మా దులు హత్య చేసిన రోజు అని, ఆ మతోన్మాద వారసులే ఈ రోజున దేశాన్ని పాలిస్తూ మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేశారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టం వలన కూలీలకు పనులు కుదించబడతాయని, రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉంటుందని ఫలితంగా ఉపాధి లేక వ్యవసాయ కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. వందరోజుల పనిని 120 రోజులుగా కొత్త చట్టంలో తీసుకొచ్చామని చెబుతున్న ప్రభుత్వం దానికి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏముంది ? జీవో జారీ చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు. పాత చట్టంలో 100 శాతం నిధులు కేటాయిస్తే కొత్త చట్టంలో 60 శాతం కేటాయించి మిగిలిన 40 శాతం ప్రభుత్వాలు భరించాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుందన్నారు. 100 శాతం నిధులు ఉన్నప్పుడు కూలీలు చేసిన ఉపాధి పనులకు నెలల తరబడి కూలీ డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయిస్తే ఎలా కూలీలకు డబ్బులు వస్తాయని ప్రశ్నించారు. కాబట్టి ఉపాధి చట్టాన్ని రద్దు చేయటం అంటే ప్రభుత్వం కూలీలకు ఉపాధి లేకుండా చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, నరసింహ, ఆటో యూనియన్ నాయకులు రెడ్డెప్ప, మున్సిపల్ యూనియన్ నాయకులు రామకృష్ణ, రాజు, తులసమ్మ, కృష్ణయ్య, ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :