నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 07 : తంబళ్లపల్లి మండలంలోని ఆర్ ఎన్ తాండ పంచాయితీ ఎద్దుల వేమన్న గారి పల్లి దళితవాడ భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని దళితవాడ ప్రజలు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సోమవారం దళితులు పూర్వీకుల నుండి మా దళితవాడకు చెందిన భూములను అగ్ర కులానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించు కోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఈ విషయం అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూ సమస్యపై అగ్రకులానికి చెందిన ఆ వ్యక్తి తమను దుర్భాషలాడడంతో పాటు దళితులను చిన్నచూపు చూడడం తోపాటు తమకు ఇష్టం ఉన్నచోట చెప్పుకోండని బెదిరిస్తున్నాడని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తరతరాలుగా దళితవాడకు చెందిన ఆ భూమిని దళితులకే కేటాయించాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం దళితులు తాసిల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఎద్దుల వేమన్న గారి పల్లె దళిత వాడకు చెందిన దళితులు పాల్గొన్నారు
Reporter
Namitha News