Monday, 14 September 2026 09:42:39 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పోలీస్ స్టేషన్ లో బాధితులకు మర్యాదతో న్యాయం చేయాలి - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

తంబళ్లపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

Date : 20 March 2026 08:26 PM Views : 375

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 20 : తమ సమస్యలను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు మర్యాదతో న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, లాకప్ రూమ్, స్టేషన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై ఎస్సై టి అనిల్ కుమార్ తో సమీక్షించారు. గ్రామాలలో ఫ్యాక్షనిజం, రాజకీయ మతపరమైన సున్నితమైన అంశాలపై నిఘాపెంచాలన్నారు. నేరాల శాతం, రోడ్డు ప్రమాదాలు, జూదాలు, అసాంఘిక చర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తీవ్రమైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరితగతిన చార్జిషీట్ వేయాలన్నారు. మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చేసిన కొచ్చి ఫిర్యాదుదారులకు మర్యాదగా మాట్లాడి వారిలో భరోసా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలు గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పరాదని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ కు ఫిర్యాదు చేయాలని గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం స్టేషన్ సిబ్బందిని వారి యోగక్షేమాలు అడిగి స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకొని పచ్చదనం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తో పాటు చేసిన సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :