Monday, 14 September 2026 05:27:40 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రత్యేక ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాల పంపిణి

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ భాష

Date : 30 May 2026 07:31 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణి - ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ భాష - వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి మదనపల్లె పట్టణం స్థానిక చిత్తూరు బస్టాండ్ సర్కిల్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఒమేగా రెహబ్ ఫెడరేషన్ బెంగళూరు వారి సహకారం తో మదనపల్లె ఫిజికల్ హ్యాండీ క్యాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విక లాంగుల కోసం ఉచిత సహాయ పరికరాల పంపిణి కార్యక్రమం నిర్వ హించారు. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమానికి ముఖ్య అతిదిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. ఇందులో లబ్ధి దారులకు అవసర మైన కృత్రిమ కాలు, కృత్రిమ చెయ్యి, చెవిటి మిషన్, వీల్ చైర్స్, చంక కర్రలు, మొదలైనవి పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ సమాజం లో వైకల్యం తో ఇబ్బంది పడు తున్న వికలాంగుల సహాయార్థం ఒమేగా రెహబ్ ఫెడరేషన్ బెంగళూరు వారు ముందుకొచ్చి వారికి అవసరమైన సహాయ పరికరాల వివరాలను కొలతలను తీసుకొని ఉచితంగా అంద జేయడంపట్ల అభి నందనలు తెలిపారు. ఇలాంటి కార్య క్రమాలు సమాజంలో ప్రతి ఒక్కరు గౌర వంగా జీవించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈకార్య క్రమాన్ని ఏర్పాటు చేసిన వికలాంగుల సంఘాన్ని అభి నందించారు. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి మాట్లాడు తూ దివ్యాంగులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వారి సమస్యలకు పరిష్కారం చూపడం కోసమే ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలి పారు.నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ వికలాంగుల సహాయ పరికరాలను గుర్తించి వారికి సహాయ పరికరాలు అంద జేయడం అభినంద నీయమన్నారు. ఈ క్యాంపు ద్వారా సుమారు 53 మందికి దివ్యాంగులకు అవ సరమైన పరికరాలను అందజేయడం జరి గిందన్నారు. టిడిపి దివ్యాంగుల విభాగం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, టమోటా మార్కెట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ డా. ఎస్. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో 53 మంది వికలాంగు లను గుర్థించి, కృతిమ అవయ వాలు, సహాయ పరికరాలు అందజే యడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టిడిపి దివ్యాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షులు వెంకట రమణ నాయుడు మాట్లాడుతూ దివ్యాంగులు గౌరవంగా జీవించ డానికి ఒమేగా రెహబ్ ఫెడరేషన్ బెంగళూరు వారు ముందుకు వచ్చి సహయ సహకారా లు అందించడం గొప్ప విషయమని తెలిపారు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ కవిత రాణి మాట్లాడుతూ తమ సంస్థలో కొనసాగుతున్న ఆనంద వృద్ధాశ్రమం లో వయోవృద్ధులకు అవసరమైన సహాయ పరికరాలను అంద జేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒమేగా రెహబ్ ఫెడరేషన్ బెంగళూరు డా.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో 53 మందికి అవసరమైన సహాయ పరికరాలను అంద జేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షులు మౌలాలి, వైఎస్ఆర్సిపి మాజీ కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్, చైతన్య సర్వీస్ సొసైటీ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జివీఎస్ బాబు, జగదీష్, వెంకట రమణ నాయుడు , ఈశ్వరి డాక్టర్ సురేష్ ట్రైనర్లు రేఖ,సవరణ, శరణ్య, వికలాంగులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: