Saturday, 12 September 2026 06:24:41 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

భారత చైతన్య యోజన పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గా న్యాయవాది పూల ప్రేమ్ కుమార్

Date : 01 February 2026 09:13 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఫిబ్రవరి 01 : భారత చైతన్య యోజన పార్టీ ఆంధ్రప్రదేశ్ యూత్ విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గా పూల ప్రేమ్ కుమార్ ను నియమిస్తూ భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం, యువతలో ఆయనకున్న ఆదరణను పరిగణలోకి తీసుకొని బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ ఈ పదవిని కేటాయించారు. పుంగనూరు కు చెందిన న్యాయవాది పూల ప్రేమ్ కుమార్ బాల్యం నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో స్వయంసేవక్ గా ఉండి అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు, గో సంరక్షణలో భాగంగా, హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా చురుగ్గా పాల్గొంటూ జాతీయ భావాలతో హిందూ ధర్మ సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తుంటారు, అదేవిధంగా విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కళాశాల విద్యార్థుల సమస్యల పైన అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కేంద్రంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు, స్వతంత్ర సమరయోధుల జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులలో జాతీయ భావాలను పెంచేలా పని చెయ్యటం మరియూ విద్యార్థుల హాస్టల్ వసతి, భోజన వసతి, తరగతి గదుల్లో విద్య లాంటి అన్ని సౌకర్యలు విద్యార్థులకు అందేలా ఉన్నంతధికారులతో చర్చించి విద్యార్థులకు అండగా ఉండేవారు, క్రీడారంగంలో విద్యార్థులు చురుకుగా ఉండేలా ప్రత్సహించటం, యువత రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించటం, ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని అవగాహనా సదస్సులు, చార్చ కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యటం లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. పూల ప్రేమ్ కుమార్ గతంలో భారతీయ జనతా పార్టీ పుంగనూరు నియోజకవర్గం కో - కన్వీనర్ గా కూడా చురుగ్గా పని చేసారు, బోడె రామచంద్ర యాదవ్ గారు పుంగనూరు మరియూ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాసమస్యల పరిష్కారం పట్ల పోరాడుతున్న విధానాలకు చూసి రైతులు, మహిళలు, నిరుద్యోగుల పట్ల, పేదల పక్షాన ఉద్యమిస్తున్న విధానాలు నచ్చి 2025 న భారత చైతన్య యోజన పార్టీలో చేరినారు. బోడే రామచంద్ర యాదవ్ గారు సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ వారి పోరాటాలు, ఉద్యమాలలో చురుగ్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భారత చైతన్య యోజన పార్టీ యువజన విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గా పూల ప్రేమ్ కుమార్ ను నియమిస్తూ భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు అని పార్టీ నాయకులు తెలియచేస్తూ పార్టీ అభ్యున్నతి మరింత కృషి చేయాలని తెలియచేసారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: