Monday, 14 September 2026 08:05:18 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తాం

Date : 08 January 2026 06:58 PM Views : 377

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తాం -- ఈనెల 12 తర్వాత ఎప్పుడైనా 108 ఉద్యోగుల సమ్మె -- సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ నెల 12వ తేదీ తర్వాత ఏ క్షణమైన సమ్మె కు వెళ్తామని 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవాధ్యక్షులు ఎ. రామాంజులు, జిల్లా అధ్యక్షులు రమణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బీవీ చలపతి లు పేర్కొన్నారు. గురువారం 108 కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన అనంతరం డి.ఆర్. ఓ మధుసూదన్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు విలేకరుల తో మాట్లాడుతూ ప్రభుత్వం వేతనం రూ. 4,000 లు పెంచుతూ జి. ఓ నంబర్ 49 ఇచ్చినప్పటికి పూర్తి స్థాయి వేతనం అమలు చేయకుండా కేవలం రూ 2 వేలే ఇవ్వడం సరికాదన్నారు. ఉద్యోగుల వేతనం నుండి పిఎఫ్ కట్ చేసుకుని యాజమాన్యం వాటా పిఎఫ్ బ్యాంక్ ఖాతా కు జమచేయకపోవడం ఉద్యోగులను మోసం చేసే దుర్మార్గపు చర్య గా పేర్కొన్నారు. ఒక్కొక్క నెలలో కొందరికి కారణం తెలపకుండా వేతనం తగ్గించి ఇస్తున్నారని, కనీసం పేస్లిప్ కూడా ఇవ్వకుండా వ్యవహారిస్తున్నా, భవ్య యాజమాన్యంపై అధికారుల చర్యలు శూన్యమని, చిన్న.. చిన్న కారణాలు చూపి ఉద్యోగులను విధుల నుండి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 18 ఏళ్ల నుండి సర్వీసు ఉన్న వారికి మళ్ళీ పరీక్ష నెగ్గడం ద్వారా నియామకం పొడిగిస్తామనడం ఉద్యోగ భద్రత గాల్లో దీపంలా ఉందన్నారు. వెంటనే పరీక్షలు రద్దు చేసి, 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి స్లాబ్ అప్గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలీవింగ్ బిల్లులు, ఐటీ డి ఏ అలవెన్స్ లు క్రమం తప్పకుండ ఇవ్వాలన్నారు. క్యాజువల్ లీవులు, పండుగ సెలవులు అమలు చేయాలని పేర్కొన్నారు. పని చేసే ప్రదేశం లో షెల్టర్ వాహన క్లీనింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని, 8 గంటలు పని అమలు చేయాలని కోరారు. వాహన మరమ్మతులు సిబ్బంది కాకుండా ప్రభుత్వం చేయించి సిబ్బంది కి అప్పుల ఉపశమనం కలిగించాలని కోరారు. జిల్లా కు ఒకటి కాకుండా డివిజన్ కి ఒక గ్యారేజ్ ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా నలుమూలల నుండి 108 సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో రైటప్ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆద్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న 108 ఉద్యోగులు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :