Thursday, 30 July 2026 01:19:34 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కిడ్నీ రాకెట్‌ ముఠా పెద్దలను కాపాడే విధంగా ప్రభుత్వ వైఖరి - జిల్లా జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలి - సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాస

Date : 16 November 2025 04:28 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కిడ్నీ రాకెట్‌ ముఠా పెద్దలను కాపాడే విధంగా ప్రభుత్వ వైఖరి - జిల్లా జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలి - సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించి, మదనపల్లె సర్వజన బోధనాసుపత్రి లోని డయాలసిస్ కేంద్రం, ఎస్బిఐ కాలనీ లోని గ్లోబల్‌ ఆస్పత్రి కేంద్రంగా నడిచిన కిడ్నీల రాకెట్‌ ముఠా పెద్దలను కాపాడే విధంగా ప్రభుత్వ వైఖరి ఉన్నదని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గ్లోబల్ ఆసుపత్రిని సిపిఎం నాయకులు హరిశర్మ తో కలసి సందర్శించిన అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ కిడ్నీ దొంగల చేతిలో కిడ్నీలు పోగొ ట్టుకున్నది ఎవరు? ఎక్కడివారు? ఆ కిడ్నీలతో లబ్ది పొందింది ఎవరు? ఎక్కడెక్కడి కిడ్నీ ముఠా సంబంధాలు ఉన్నాయి? అన్న విషయాలు తేల్చాలని అందుకోసం జిల్లా సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కిడ్నీ దొంగలను 6 మందిని అరెస్టు చూపిన పోలీసులు ఎందుకు గ్లోబల్ ఆసుపత్రిని సీజ్ చేయలేదని, పోలీసు బందోబస్తీ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కిడ్నీ ముఠా వల్ల లబ్ధి పొందిన వారి వివరాలను, విచారణ నివేదికను వెల్లడించక పోవడం విడ్డూరం అన్నారు. లక్షల మంది మదిని తొలసేస్తున్న ప్రశ్న. యమున అనే యువతి చనిపోతే మృతదేహాన్ని రెండురోజులు పాటు దాచేసి, గుట్టుచప్పుడు కాకుండా ఆమె స్వగ్రామానికి తరలించే ప్రయత్నంలో కిడ్నీ రాకెట్‌ ముఠా సభ్యులు మద్య పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగా కిడ్నీ రాకెట్‌ వ్యవహారం బట్టబయలైందని గుర్తుచేశారు. కిడ్నీ రాకెట్‌లో కీలక పాత్ర ఉన్న గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యంలోని డాక్టర్‌ ఆంజనేయులు మినహా అందులో పని చెస్తున్న వైద్య బృందం డాక్టర్‌ అవినాష్‌, డాక్టర్‌ శాశ్వతిలపై ఎలాంటి కేసులు నమోదు చేయక పోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కిడ్నీ రాకెట్‌లోని మూలాలను గుర్తించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, బెంగుళూరు వైద్యుడు ఎవరు అనే విషయం తేల్చలేదని, కిడ్నీ రాకెట్‌లో అసలు సిసలైన దొంగల ముఠాను పట్టుకోవాల్సిన బాద్యత ప్రభుత్వం పై ఉన్నదని అన్నారు. పెద్దస్థాయిలో పైరవీలు జరుగుతున్న కారణంగా కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్లను కేసులో చేర్చలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా జడ్జి తో విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: