Monday, 14 September 2026 09:34:49 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ తైవాన్ పై గెస్ట్ లెక్చర్

Date : 27 January 2026 07:50 PM Views : 224

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 27: అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఈ.సి.ఈ. విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ తైవాన్ పై గెస్ట్ లెక్చర్ ను నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి రిసోర్సు పర్సన్ గా యన్. ఉమేశ్వర్ రెడ్డి, నేషనల్ యంగ్ మింగ్ చియో తుంగ్ విశ్వవిద్యాలయం, తైవాన్‌ నుండి ఎలక్ట్రో ఫిజిక్స్ నందు పి.హెచ్. డి. పొందిన మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ తైవాన్‌ లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయుటకు ఎన్నో యూనివర్సిటీ లు స్టే ఫండ్ తో కూడిన అడ్మిషన్స్ లు అందిస్తున్నాయని, విద్యార్థులు వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. తైవాన్ ఆర్థిక రంగంలోనే కాకుండా విద్యలో కూడా గణనీయమైన ముద్ర వేసింది అని, అతిపెద్ద ఉత్పాదక కేంద్రాలు మరియు అత్యంత వేగవంతమైన ఆసియా ఆర్థిక వ్యవస్థలలో, తైవాన్ ఆసియా నడిబొడ్డున ఉన్న ఒక అందమైన దేశం అని అన్నారు. విద్యార్థులు తైవాన్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ అభ్యసించాలనుకున్నప్పుడు తైవాన్‌కు విద్యార్థి వీసా ఇవ్వబడుతుంది అని, ఈ వీసాకు అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని విద్యార్థులు వాటి ని ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రస్తుతం, తైవాన్‌లోని అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో విద్యార్థుల అనేక గ్రూపుల లో మాస్టర్స్ లేదా పీహెచ్‌డీని అభ్యసిస్తున్నారని చెప్పారు. తైవాన్‌లోని చాలా మంది భారతీయ విద్యార్థులు ఇంజినీరింగ్, నేషనల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్, బిజినెస్ మరియు మేనేజ్‌మెంట్ రంగాలలో హయ్యర్ ఎడ్యుకేషన్ అభ్యసిస్తున్నారని ఆయన అన్నారు. తైవాన్ విశ్వవిద్యాలయాలు ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి ఇష్టపడతాయి అని, వివిధ అంశాలలో రాణిస్తారు అని అక్కడ వారికీ ఒక నమ్మకం అని అన్నారు. మన యూనివర్సిటీ కు కు తైవాన్ లో గల యూనివర్సిటీ లతో ఎంఓయూ లు ఉన్నాయని, తద్వారానే తాను కూడా తైవాన్ కు వెళ్లి పీ.హెచ్డి పూర్తి చేసినట్లు, ఇందుకు సహాయ సహకారాలు అందించిన మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీసర్ యూ, విజయలక్ష్మి, ఈ సి ఈ విభాగం వారికి, మిట్స్ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల కు కృతఙతలు తెలిపారు. కార్యక్రమం లో మేనేజర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు. విజయ లక్ష్మి, ఈ.సి.ఈ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ , అల్మిని కో ఆర్డినేటర్ డాక్టర్ జి నాగాశ్వేత , సి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: