Sunday, 13 September 2026 05:40:08 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సెక్యూరిటీ సిబ్బందిపై వివక్ష ఆపాలి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం మానుకోవాలి

Date : 14 May 2026 03:04 PM Views : 147

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సెక్యూరిటీ సిబ్బందిపై వివక్ష ఆపాలి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం మానుకోవాలి ఆర్ఎంఓకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు విశాలాంధ్ర , మదనపల్లి: మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం మానుకోవాలని, సెక్యూరిటీ సిబ్బంది హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏఐటీయూసీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాధికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి డ్యూటీ సమయంలో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డ్యూటీ ముగిసిన తర్వాత మాత్రమే తిరిగి ఇస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ఔట్ సోర్సింగ్ సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగిస్తున్నప్పటికీ సెక్యూరిటీ సిబ్బందిపైన మాత్రమే ఈ నిబంధనలు అమలు చేయడం స్పష్టమైన వివక్షతకు నిదర్శనమన్నారు. ఇటువంటి దుర్మార్గమైన విధానం రాష్ట్రంలోనే కాక దేశంలో ఎక్కడా లేదన్నారు. ఈ విధానం వల్ల సెక్యూరిటీ సిబ్బంది అత్యవసర కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సంప్రదింపుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. సెక్యూరిటీ సిబ్బందిపై అమలు చేస్తున్న వివక్షతపూరిత విధానాలను వెంటనే నిలిపివేయాలని, కార్మికుల సెల్ ఫోన్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సమాన నిబంధనలు అమలు చేయాలని కోరారు. కార్మిక హక్కులను ఉల్లంఘిస్తున్న సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీ సిబ్బందికి గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, రవి తదితరులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :