Sunday, 13 September 2026 10:02:39 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ప్రేక్షకులను అలరించిన 'వినుర వేమ' నాటకం యోగి వేమన జీవిత చరిత్రను ఆవిష్కరించిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు

Date : 08 July 2026 04:10 PM Views : 207

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రేక్షకులను అలరించిన 'వినుర వేమ' నాటకం యోగి వేమన జీవిత చరిత్రను ఆవిష్కరించిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు విశాలాంధ్ర, మదనపల్లి: భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) సౌజన్యంతో, అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ సమర్పణలో స్థానిక సీఎస్‌ఐ కమ్యూనిటీ హాల్‌లో ప్రజాకవి యోగి వేమన జీవిత చరిత్ర ఆధారంగా ప్రదర్శించిన 'వినుర వేమ' ఆధునిక నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమాన్ని బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్‌తో కలిసి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఇన్‌చార్జి జగ్గరాజు, రోజా హోటల్స్ అధినేత కంభం నాగభూషణ్ రెడ్డి, విశ్రాంత ఎంఈఓ పోతబోలు రెడ్డెప్ప, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ వార్డెన్లు వెంకటేష్, విజయ్‌కుమార్, బహుజన సేన అధ్యక్షుడు శ్రీచందు, గిరిజన సమాఖ్య అధ్యక్షుడు దివాకర్ తదితరులు యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, తెలుగు సాహిత్య చరిత్రలో ప్రజాకవి యోగి వేమనకు చిరస్థాయి స్థానం ఉందన్నారు. ఆయన కేవలం కవి మాత్రమే కాకుండా తత్వవేత్త, సంఘ సంస్కర్త, యోగి, మానవతావాది అని కొనియాడారు. తన పద్యాల ద్వారా కులమత వివక్ష, మూఢనమ్మకాలు, కపటత్వం, సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ సమానత్వం, సత్యం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లో చాటిచెప్పారని పేర్కొన్నారు. 'వినుర వేమ' నాటకంలో వేమన బాల్యం నుంచి యోగిగా ఎదిగిన జీవన ప్రయాణం, సామాజిక దురాచారాలపై ఆయన చేసిన పోరాటం, సమానత్వం, నీతి, సత్యంపై ఆయన బోధనలు హృద్యంగా ఆవిష్కరించబడ్డాయి. "ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల? భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధి లేని శివపూజలేలరా? విశ్వదాభిరామ వినుర వేమ" వంటి ప్రసిద్ధ వేమన పద్యాలను నృత్య, గాన రూపంలో ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వేమన బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తే సమాజంలో నైతిక విలువలు మరింత బలపడతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బాస్ ప్రతినిధులు ముత్యాల మోహన్, నీరుగట్టి రమణ, గంగాధర్, శశిధర్, బండకోట రవి, జి.వి. రమణ, సొన్నికంటి రెడ్డెప్పతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: