నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 14 : రామసముద్రం మండలం పెద్దకురపల్లె గ్రామంలో ఓ యువకుని పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుని కుటుంబసభ్యుల వివరాల మేరకు పెద్దకురప్పల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు 28 సంవత్సరాల అశోక్ కుమార్ కు ఇదే గ్రామానికి చెందిన హరి కి మధ్య కొంత కాలంగా తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి, తీవ్ర కోపోద్రిక్తుడైన హరి తన వద్ద తెచ్చుకున్న కత్తితో అశోక్ కుమార్ పై దాడి చేసి కడుపు పై కత్తితో పొడిచి గాయం చేశాడు. గమనించిన అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుని తండ్రి శ్రీనివాసులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై రమేష్ బాబు సంఘటన జరిగిన చోటు ను పరిశీలించి నిందితుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Namitha News